సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (12:05 IST)

బస్సు డే... వద్దన్నా కోతుల్లా ఎగబాకిన విద్యార్థులు... డ్రైవరుకి మండి... (Video)

బస్సు డే వేడుకల్లో అపశృతి చోటు వేసుకుంది. స్థానిక పచ్చయప్పాస్ కళాశాలకు చెందిన విద్యార్థులు బస్సు డే వేడుకలు నిర్వహించారు. అన్నానగర్ నుండి పచ్చయప్పాస్ కళాశాల మీదుగా వేళ్లే బస్సుపైకి ఎక్కి పాటలు పాడుతూ ప్ల కార్డులు పట్టుకొని వెళుతుండగా బస్సు డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా బస్సుపై నుండి జారిపడ్డారు. 
 
వీరిలో 18 విద్యార్థులు కిందపడగా కొందరికి స్వల్పగాయాలు అయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం‌ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బస్సుడే వేడులపై ఆంక్షలు ఉన్నా తరచూ పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు వేడుకలు నిర్వహించటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. 
 
కాగా బస్సు డ్రైవర్ ఎంత మొత్తుకున్నా విద్యార్థులంతా మూకుమ్మడిగా బస్సు టాపు పైకి ఎక్కి కూర్చోవడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కిందపడినట్లు చెప్పుకుంటున్నారు. విద్యార్థులను ఎంత వారించినా తలోవైపు కోతుల్లా బస్సుపైకి ఎగబాకి ప్రమాదానికి కారణమయ్యారంటే బస్సులో వున్న కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం.