శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (12:38 IST)

మామిడితోటల్లో వ్యభిచారం.. కాలేజీ స్టూడెంట్సే ఆ పని చేస్తున్నారట..?

కాలేజీ స్టూడెంట్స్ వ్యభిచార రొంపిలోకి దిగేశారు. శ్రీకాకుళం మామిడి తోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వారిలో అత్యధికులు కాలేజీ స్టూడెంట్లేనని పోలీసులు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మామిడి తోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడులకు వెళ్లారు. అక్కడ వీరికి 20 మంది యువకులు, ముగ్గురు అమ్మాయిలు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన వారిలో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.