గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (10:30 IST)

హెల్మెట్ ధరించకనే సీఎం భార్య చనిపోయారు : కిరణ్ బేడీ

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి భార్య ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీనిపై ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం నారాయణ స్వామి భార్య హెల్మెట్ ధరించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
తమిళనాడులో ద్విచక్ర వాహన చోదకులకు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, హెల్మెట్ లేకుండా కనిపిస్తే, బండిని సీజ్ చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీనిపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. 
 
ముఖ్యమంత్రి నారాయణ స్వామి భార్య, తలకు హెల్మెట్‌ లేకుండా బైకుపై ప్రయాణించినందునే మరణించారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నిర్బంధ హెల్మెట్ చట్టాన్ని సుప్రీంకోర్టు తెచ్చినా, తమిళనాడు, పుదుచ్చేరిలో సరిగ్గా అమలు కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్రవాహన చోదకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనన్నారు. 
 
కాగా, గతంలో నిబంధనల అమలులో నారాయణస్వామి, కిరణ్ బేడీ మధ్య కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. 2013లో నారాయణ స్వామి భార్య కలైసెల్వి, తన బంధువుతో కలిసి బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురై కన్నుమూశారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని టెంపో ఢీకొనగా, తలకు బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోయారు.