గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (13:43 IST)

బ్యాటింగ్ చేస్తూ క్రీజ్‌లో కుప్పకూలిపోయిన లంక క్రికెటర్

శ్రీలంక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తూ క్రీజ్‌లో కుప్పకూలిపోయారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు ఆడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ వేగంగా సంధించిన బంతిని లంక బ్యాట్స్‌మెన్ దిముత్ కరుణరత్నే ఎదుర్కొన్నారు. 
 
ఈ బంతి 142 కిలోమీటర్ల వేగంతో రాగా, దాన్ని తప్పించుకునే కరుణ రత్నే ప్రయత్నించాడు. అయితే ఆ బాల్ మెడ వెనుక భాగంలో బలంగా తగిలింది. దీంతో గ్రౌండ్‌లోనే పడిపోయాడు. ఫీల్డ్ నుంచి స్ట్రెచ‌ర్‌పై బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి ఆస్పత్రికి తరలించారు. నొప్పి ఎక్కువ‌గా ఉంద‌ని, చేతి న‌రాలు కూడా లాగుతున్న‌ట్లు క‌రుణ‌ర‌త్నే వైద్యులకు వివరించాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాడు. 
 
Dimuth Karunaratne