లోపలేసి కుళ్లబొడిచి నట్లు బిగిస్తాం అంటూ తెలుగుదేశం నేతకు బెదిరింపులు

శ్రీ| Last Updated: శనివారం, 22 జూన్ 2019 (18:36 IST)
తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు పార్టీ మారిన గంటలోపే తనకు బెదిరింపులు మొదలయ్యాయని వాపోతున్నారు తెలుగుదేశం నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 'సుజనా చౌదరి ఇంటి నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నాకు ఫోన్‌ చేసి బెదిరించారంటూ బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే జైల్లో పెడతారని తనను భయానికి గురి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. పార్టీ మారిన ఎంపీలపై తాను విమర్శలు చేస్తున్న నేపథ్యంలో యార్లగడ్డ తనకు ఫోన్ చేసి విమర్శలు ఆపకపోతే
జైలులో పెడతారని, నట్లు బిగిస్తారని బెదిరించారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని తెలియజేశారు.

ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు తనపై ఒక్క ఆరోపణ కూడా రాలేదని, అలాంటి తనను బెదిరించడం ప్రజాస్వామ్యంలో దిగజారిన చర్య అని అభిప్రాయపడ్డారు. తనకు ఫోన్లో కాల్ రికార్డు చేసే అలవాటు లేదని... లేదంటే యార్లగడ్డ బాగోతం సాక్ష్యాలతో సహా బయట పెట్టేవాడినని తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :