శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (19:40 IST)

మే 23న రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి పట్టాభిషేకం చేస్తారు.. బుద్ధా వెంకన్న

శ్రీరామ పట్టాభిషేకం తరహాలో మే 23న రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి పట్టాభిషేకం చేయనున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా.. ఐదేళ్ల పాటు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. 
 
విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. వైకాపా, భాజపా నాయకులపై మండిపడ్డారు. ఈవీఎం లోపాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తుంటే, ఆయనకు ఓటమి భయం పట్టుకుందంటూ విపక్ష నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. 
 
ఈవీఎంలు పనిచేయక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడితే.. వైకాపా నేత విజయసాయి రెడ్డి ఈసీ బాగా పనిచేసిందంటూ కితాబివ్వడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ లో క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈవీఎంలు వినియోగిస్తే ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో 25 లక్షల ఓటర్లను తొలగించారని, అక్కడ జరిగిన ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ ‘సారీ’ చెప్పి చేతులు దులుపుకుందని అన్నారు. 
 
తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఇబ్బంది తప్పలేదని, ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు