1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Telangana RTC union leaders also join Duties

ఆర్టీసి కార్మిక నేతలు కూడా డ్యూటీలు చేయాల్సిందే...

Telangana
ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా విధుల్లో చేరారు. తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకోవడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అందరినీ డ్యూటీల్లో చేరి… ఉద్యోగాలు చేసుకోండని చెప్పారు. 
 
మరోవైపు బస్సు భవన్‌లోని అధికారిక కార్మిక సంఘం టీఎంయు కార్యాలయానికి ఆర్టీసీ యాజమాన్యం తాళం వేసింది. అంతేకాదు ఆర్టీసి కార్మిక నేతలు కూడా ఇప్పటి నుంచి సాధారణ కార్మికుల మాదిరిగానే విధులు నిర్వహించాల్సిందేనని తెలిపింది. 
 
ఇప్పటివరకూ వారికి కల్పించిన విధులు నుంచి మినహాయింపు హక్కులను రద్దు చేసింది. దీని ప్రకారం ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డితో సహా యునియన్‌ నేతలంతా డ్యూటీలు చేయాలి. ఇతర కార్మికుల మాదిరిగానే వారందరు విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు అధికారులు.
 
ఇప్పటివరకు మొత్తం 30 మంది కార్మిక నేతలకు డ్యూటీ మినహాయింపు ఉండేది. ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు చెందిన వారు 26 మంది ఉన్నారు. ఇంకా కార్మికుల నుంచి యూనియన్‌ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో చెక్‌ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ యూనియన్లు ఉండకూడదని అధికారులు చర్యలు చేపట్టారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్లీజ్.. మా ఇంటికి రావొద్దు.. ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు.. గేట్లకు తాళం