ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 నవంబరు 2019 (20:16 IST)

రేపే జాయిన్ అవండి: ఆర్టీసి కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురు

ఆర్టీసి కార్మికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. రేపే కార్మికులు తమతమ విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఆయన మాటల్లోనే, ' మీ డ్యూటీల్లో జాయిన్ అవండి. మా బిడ్డలని చెప్పినా. యూనియన్ నాయకుల మాటలను నమ్మొద్దు. ఆర్థిక మాంద్యం వున్నప్పటికీ ఆర్టీసి కార్మికలు సాయం చేస్తున్నాం. సంస్థలో రూ. 13 కోట్లు బ్యాలెన్స్ వుంది.
 
ప్రభుత్వం నుంచి రూ. 100 కోట్లు ఇస్తాం. అంతతో వూరుకోం, ఆర్టీసి చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. కిలో మీటరుకి 20 పైసలు పెంచితే 700 కోట్లు వస్తాయి. వచ్చే సోమవారం నుంచి చార్జీలు పెంచుకునే అవకాశం. దీన్ని అలుసగా తీసుకుంటే మీరే మునుగుతారు. మీరు రోడ్డున పడవద్దు.
 
ప్రైవేటీకరణపై బైట సన్నాసులు ప్రచారం వేరేగా చేశారు. ప్రైవేట్ పర్మిట్ ఇవ్వాల్సి వస్తే... ఆర్టీసీలో వీఆర్ఎస్ తీసుకున్నవారికే ఇద్దామని అనుకున్నాం. మీకు మీ ఉద్యోగ భద్రత, ప్రగతి భవన్‌కి పిలిచి కార్మికులతో మాట్లాడుతా. ఆర్టీసి పరిస్థితిని ప్రతి కార్మికుడికి తెలియజేస్తా. యూనియన్లను సంప్రదించం, వారిని క్షమించదలచుకోలేదు. 20 మంది కార్మికులు చనిపోవడానికి కారకులయ్యారు వాళ్లు. చనిపోయిన కుటుంబాలలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం.
 
మాకు మానవత్వం వుంది. యూనియన్లకు బదులు వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. దానికి మంత్రిని ఇంచార్జిగా నియమిస్తాం. ఆర్టీసి మీది, సమ్మె చేస్తే, సంస్థ మునిగిపోతే మీరెక్కడ వుంటారు? అందుకే సంస్థను కాపాడుకుందాం. లాభాల్లో పయనిస్తే మీరు కూడా సింగరేణి కార్మికుల్లో ఎక్కువ వేతనాలను పొందవచ్చు'' అని చెప్పారు కేసీఆర్.