1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Telangana : Uncle beat by son-in-law

మా అల్లుడిని చంపేశానంటూ లొంగిపోయిన మామ.. ఖాకీలు ఇంటికి రాగానే...

తమ అల్లుడిని చంపేశానంటూ ఓ మామ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శవం కోసం ఇంటికి వచ్చారు. అయితే, అల్లుడు తాపీగా కూర్చొని చెకోడీలు తింటూ కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురైయ్యారు. ఈ ఘట

Telangana
తమ అల్లుడిని చంపేశానంటూ ఓ మామ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శవం కోసం ఇంటికి వచ్చారు. అయితే, అల్లుడు తాపీగా కూర్చొని చెకోడీలు తింటూ కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురైయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్తనారంవారిగూడేనికి చెందిన గురింద నాగులు అనే వ్యక్తి అల్లుడు రాజు. నిత్యం తాగొచ్చి నానా యాగీ చేస్తుంటాడు. బుధవారం ఉదయం కూడా మద్యం మత్తులో వచ్చి మామతోపాటు భార్యను వేధించాడు. అల్లుడి గోల భరించలేని మామ.. లాగి పెట్టి చెంపమీద కొట్టాడు. 
 
ఆ దెబ్బతో దిమ్మదిరిగిన రాజు గింగరాలు తిరుగుతూ కింద పడిపోయాడు. నోట మాటలేదు. దీంతో చనిపోయాడని భావించిన మామ నాగులు నేరుగా స్థానిక పోలీస్ ఠాణాకు వెళ్లి.. మా అల్లుడుని చంపేశా.. కేసు నమోదు చేసి అరెస్టు చేయండి అంటూ లొంగిపోయాడు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... సంఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడ అల్లుడు రాజు చక్కగా లేచి కూర్కొని చెకోడీలు తింటూ కనిపించాడు. పైగా, స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడుతో వైద్యం కూడా చేయించుకున్నాడు. మామ చేసిన పోలీసులతో పాటు స్థానికులు కూడా విస్తుపోయారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హోం వర్క్ చేయలేదనీ.. కంటిలో పెన్నుతో గుచ్చిన టీచర్.. ఎక్కడ?