శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (10:26 IST)

హోం వర్క్ చేయలేదనీ.. కంటిలో పెన్నుతో గుచ్చిన టీచర్.. ఎక్కడ?

విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన గురువురు అతికిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ఓ విద్యార్థి హోం వర్క్ చేయలేదనీ కంటిలో పెన్నుతో గుచ్చింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాహజన్‌పూర్‌లో జరిగి

విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన గురువురు అతికిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ఓ విద్యార్థి హోం వర్క్ చేయలేదనీ కంటిలో పెన్నుతో గుచ్చింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాహజన్‌పూర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా భావల్‌ఖేడా బ్లాక్‌లోని రహీంపురాకు చెందిన రామ్‌సింగ్ కుమారుడు లవ్‌కుష్ స్థానికంగా ఉండే ఊర్మిళాదేవి ఉచ్ఛతర్ మాధ్యమిక విద్యాలయంలో కేజీ తరగతి చదువుతున్నాడు. 
 
ఈ చిన్నారికి టీచర్ హోం వర్క్ ఇచ్చింది. దాన్ని చేయకుండా మరుసటిరోజు బడికి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన టీచర్.. ఆ విద్యార్థిని చితకబాది.. కంటిలో పెన్నుతో పొడిచింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ విషయంపై విద్యారాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.