1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Telugu uni code fonts unveiled by Sirivennela Seetharamasastry

వేటూరి - సిరివెన్నెల పేరుతో తెలుగు ఫాంట్స్

Telugu Uni Code
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా రెండు రకాలైన తెలుగు ఫాంట్స్‌ను టాలీవుడ్ నటుడు అప్పాజీ అంబరీష దర్భ సిద్ధం చేశారు. ఈయన గతంలో అనేక తెలుగు ఫాంట్స్ రూపొందించారు. ఇపుడు మరో రెండు రకాల యూనికోడ్ ఫాంట్స్‌కు రూపకల్పన చేశారు. 
 
ఈ ఫాంట్స్‌కు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సుప్రసిద్ధ సినీ గీత రచయితలైన 'వేటూరి', 'సిరివెన్నెల' పేర్లను ఆ రెండు ఫాంట్లకు పెట్టారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ రెండు ఫాంట్స్‌ను సిరివెన్నెల సీతారామశాస్త్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ, గురుసమానులైన వేటూరి సుందర్రామ్మూర్తి పేరుతో రూపొందించిన ఫాంట్స్ ను ఆవిష్కరించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని అన్నారు. అంబరీష ఎంతో ఆసక్తితో భాష పట్ల కృషి చేస్తున్నారని, ఫాంట్స్‌ను తయారుచేసి తెలుగు భాష ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నారని కొనియాడారు. 
తర్వాతి కథనం
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. పుణేలో రాత్రి కర్ఫ్యూ