గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

గుమ్మడి కాయ కొట్టేసిన 'వకీల్ సాబ్' - సంక్రాంతికి టీజర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ చిత్ర పింక్‌కు రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. 
 
ఇటీవలే పవన్‌పై సన్నివేశాల చిత్రీకరణ కూడా ముగిసింది. ఆ తర్వాత ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు శ్రీరామ్ వేణు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి సారించారు. ఈ వేసవి నాటికి వకీల్ సాబ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక. వకీల్ సాబ్ మాతృక 'పింక్'లో అమితాబ్ బచ్చన్‌కు కథానాయిక లేకపోయినా, పవన్ ఇమేజ్ దృష్ట్యా కథలో కొద్దిగా మార్పులు చేసి హీరోయిన్ పాత్ర తీసుకువచ్చారు. 
 
ఇక, కథకు కీలకమైన పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 14న వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.