కేజీఎఫ్ స్టార్ యాష్‌కు బర్త్ డే.. #KGFChapter2Teaser రిలీజ్.. వైరల్
yash
తాజాగా యాష్ కేజీఎఫ్ 2 కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు యష్ బర్త్ డే సందర్భంగా గత రాత్రి చిత్ర టీజర్ విడుదల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన గంట 52 నిమిషాలలో 10 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి.
చిత్రంలో రమిక అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న రవీనా టాండన్.. యష్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. యశ్ జెమ్ లాంటి వ్యక్తి. ఎంత ప్రతిభావంతుడో, అంతే మంచివాడు. అద్భుతమైన నటుడు. తనతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను అని పేర్కొన్నారు.
KGFChapter2Teaser
యష్ బర్త్ డే సందర్భంగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన స్టార్సే కాక తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులు కూడా అతనికి సోషల్ మీడియా ద్వారా విషస్ తెలియజేస్తున్నారు. యష్ ఇలాంటి చిత్రాలు మరెన్నో చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
KGF Chapter 2 | yash | sanjay Dutt | Raveena thandon | shrinithi Shetti | pic.twitter.com/hDdL4lKJ3v
— Ponnusamy (@ImRo41) January 8, 2021
