కేజీఎఫ్ 2 టీజర్: జనవరి 8న 10.18ని.లకు ముహూర్తం...
KGF 2 teaser
కేజీఎఫ్ 2 కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 8 ఉదయం 10.18ని.లకు చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. కేజీఎఫ్ 1 విడుదలైన డిసెంబర్ 21న పార్ట్-2కు సంబంధించిన మేజర్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. కేజీఎఫ్ 2 మొత్తాన్ని 120 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. సమ్మర్ లో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
