శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (11:29 IST)

'లవ్‌ @ 60'.. వెబ్ సిరీస్‌లో జయప్రద, రాజేంద్రప్రసాద్

Jayapradha-Rajendra prasad
లాక్‌డైన్ పుణ్యమా అని ఇప్పుడంతా ఓటీటీలదే హవా. దీంతో సినీతారలు కూడా వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా దర్శకుడు వీఎన్ ఆదిత్య ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. 
 
కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా రాజకీయాలతో బిజీగా ఉన్న జయప్రద ఈ వెబ్ సిరీస్ కోసం మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. అటూ రాజేంద్రప్రసాద్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మారుతున్న ట్రెండ్‌కు అనుకూలంగా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
తాజాగా ఆదిత్య వెబ్ సిరీస్‌లో జయప్రద, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి టైటిల్‌గా 'లవ్‌ @ 60' అని ఫిక్స్ చేశారట. 60ఏళ్లు దాటిన ఓ జంట ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌లో ఈ వెబ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.