గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (09:41 IST)

ప్రేమలో పస లేదు.. అందుకే బ్రేకప్ చేపుతున్నా : నటి పూజాగౌర్

సినీ నటి పూజాగౌర్ తన ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. దశాబ్దకాలం పాటు సాగిన ప్రేమలో ఎలాంటి మజా లేదని చెబుతూ తన ప్రియుడుకి టాటా చెప్పేసింది. తాము విడిపోయినప్పటికీ స్నేహితుల్లో ఉంటామని చెప్పుకొచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నటి పూజాగౌర్ బుల్లితెర నటుడు రాజా సింగ్‌ అరోరాతో పదేళ్ళుగా  ప్రేమను కొనసాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది కూడా. చిన్నచిన్న గొడవలు చోటుచేసుకుంటున్నట్టు చెప్పింది. దీంతో వారిద్దరూ విడిపోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
 
పైగా, తామిద్దరం పరస్పర అంగీకారంతో ఇద్దరం విడిపోయినట్టు తెలిపారు. రాజ్‌తో తనకున్న రిలేషన్ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారని పేర్కొన్న నటి.. తామిద్దరం విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 
 
ఇక నుంచి ఎవరి జీవితం వారిదే అయినప్పటికీ తమ మధ్య ఇంతకాలం ఉన్న ప్రేమాభిమానాలు, ఒకరంటే మరొకరికి గౌరవం జీవితాంతం ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇకపై తామిద్దరం మంచి స్నేహితులమని, ఈ విషయంలో ఎప్పటికీ మార్పు ఉండబోదని పూజాగౌర్ పేర్కొన్నారు.