మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (10:28 IST)

వరంగల్‌లో ప్రేమ జంటల ఆత్మహత్యల కలకలం.. మైనర్ ప్రేమికులు..?

వరంగల్ జిల్లాలో వరుసగా ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపుతోంది. నిన్నటికి నిన్న వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.. చేతులు కట్టుకుని మరీ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు.. ఇక ఇవాళ ఉమ్మడి వరంగల్ ప్రస్తుత జనగామ జిల్లాలో మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
 
పాలకుర్తిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది మైనర్ ప్రేమ జంట.. మృతులను శిరీషాల లక్ష్మి (16), చరుల్లా అంజి (17)గా గుర్తించారు పోలీసులు.. పాలకుర్తి మండల కేంద్రంలోని ఏర్రమల్లయ కుంట సమీపంలోని బుడగ జంగాల కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు మైనర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.