సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (12:08 IST)

మైనర్ బాలికపై యువకుల అకృత్యం.. గర్భం వచ్చిందని మాత్రలిచ్చారు.. చివరికి?

దేశంలో మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలికలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అనంతరం ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన దుగ్గొండి మండలం రేపల్లెలో జరిగింది. 
 
అయితే గర్భాన్ని తొలగించేందుకు బాలికకు యువకులు మాత్రలు ఇచ్చారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతనెల 26న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వైలుగులోకి వచ్చింది.