సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (16:35 IST)

షాక్.. గర్భవతిగా వుండి కూడా కోహ్లి భార్య అనుష్క శర్మ శీర్షాసనం (Video)

ఆసనాలు వేయాలంటే సామాన్యమైన విషయం కాదు. కానీ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, నటి అనుష్క శర్మ శీర్షాసనం వేసి నెటిజన్లకు షాక్‌కి గురి చేసింది. గర్భవతి అయితే చాలామంది కదల్లేకుండా వుంటారు. చాలా జాగ్రత్తగా మసలుకుంటుంటారు. ఇక యోగా, ఆసనాలకు కొంతకాలం బ్రేక్ చెప్పేస్తారు. కానీ అనుష్క శర్మ మాత్రం తను రోటీన్ గా చేసేవి అస్సలు మానే ప్రసక్తే లేదని తేల్చేసింది.
 
తన భర్త కోహ్లి సాయంతో శీర్షాసనం వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫోటోతో పాటు కొన్ని విషయాలను కూడా పంచుకుంది. తను చేస్తున్న ఈ శీర్షాసనం తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకే చేసినట్లు తెలిపింది. గర్భవతిగా వున్నప్పుడు మన శరీరం యోగాకి అనువుగా వుంటే వేయవచ్చని వైద్యుడు చెప్పారనీ, అందువల్ల ఇలా చేసినట్లు పేర్కొంది.