శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (18:10 IST)

భార్యకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ రవి.. ఏంటది..? (video)

Anchor Ravi
తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ క్లాస్ ఫాలోయింగ్ సంపాదిస్తే.. మాస్ మహారాజా అనిపించుకున్నాడు రవి. పటాస్ లాంటి షోలను ఏళ్ల పాటు నడిపించిన ఘనత మనోడి సొంతం. అంతేకాదు మాస్ యాంకరింగ్‌తో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎఫైర్స్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఈ యాంకర్ ట్రెండింగ్‌లోనే ఉంటాడు. 
 
కానీ రెండేళ్లుగా అన్నీ బంద్ అయిపోయాయి. ఆ మధ్య ఓ రోజు సడన్‌గా తన భార్య నిత్య సక్సేనాతో పాటు కూతురును కూడా ప్రపంచానికి పరిచయం చేశాడు యాంకర్ రవి. అప్పటి వరకు ఈయనకు పెళ్లైపోయిందని చాలా మందికి కనీసం ఐడియా కూడా లేదు. ఉన్నట్లుండి తన పర్సనల్ లైఫ్‌ను బయటపెట్టేసాడు రవి. 
Anchor Ravi


ఇదిలా ఉంటే భార్య నిత్యను పరిచయం చేసిన తర్వాత ప్రతీ ఈవెంట్‌ను కూడా ఆమెతో జరుపుకుంటూ.. ఆ వీడియోను అభిమానులతో పంచుకుంటున్నాడు రవి. ఇప్పుడు తమ పెళ్లి రోజు కానుకగా భార్య నిత్యా సక్సేనాకు మరిచిపోలేని బహుమతి ఇచ్చాడు.
 
నవంబర్ 27న పెళ్లి రోజు సందర్భంగా తన భార్యతో కలిసి ఓ కవర్ సాంగ్ చేశాడు యాంకర్ రవి. ఇప్పటి వరకు స్క్రీన్‌పై కనిపించని తన భార్యతో కలిసి ఓ డ్యూయెట్ చేసాడు ఈ యాంకర్. సూపర్ హిట్ అయిన ఏమో ఏమో పాటకు కవర్ వర్షన్ చేసారు రవి దంపతులు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ వైరల్ అవుతుంది. అందమైన లొకేషన్స్‌లో అదిరిపోయే సినిమాటోగ్రఫీతో ఈ పాట కన్నుల పండుగగా ఉంది. ఓ భార్యకు ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏముంటుంది అంటూ కింద కామెంట్ చేస్తున్నారు అభిమానులు. దాంతో వాళ్లిద్దరికీ పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.