శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (16:30 IST)

#KGFChapter2_డిసెంబర్ 21న బిగ్ అప్ డేట్.. చెప్పిందెవరంటే?

కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్‌. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. డిసెంబర్ 21న ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ రానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇన్నాళ్లు ఎంతో ఓపికగా ఉన్న ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేసిన ప్రశాంత్ నీల్ డిసెంబర్ 21 మీ అందరికి చాలా స్పెషల్ కానుందని తెలియజేశాడు. 
 
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యష్‌, సంజయ్ దత్, రవీనా టాండన్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. గరుడని హత్య చేసి నరాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ ఎలా బిల్డ్ చేసుకున్నాడు?.. ఎలా నరాచీకి కింగ్‌గా మారాడన్న అంశాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా రెండవ పార్ట్‌ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం యాష్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.