శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (16:01 IST)

తెలంగాణలో భారీగా ఉద్యోగాల నియామకాలు.. శాఖల వారీగా..?

తెలంగాణలో భారీగా ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఖాళీల లెక్క తేల్చే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా అన్నిశాఖల కార్యదర్శులతో సమీక్షలు నిర్వహించారు. ఆయా శాఖల వారీగా ఖాళీల వివరాలను ఆర్థికశాఖకు అందించాలని ఆయన ఆదేశించారు.
 
వివిధ కార్పొరేషన్లలో ఉన్న ఖాళీల వివరాల వివరాలను సైతం అందించాలని సోమేష్ కుమార్ సూచించారు. ఆయన ఆదేశాల మేరకు ఆయా శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు వారి శాఖల వారీగా ఖాళీల వివరాలను తేల్చి వివరాలను ఆర్థిక శాఖకు అందిస్తున్నారు. 
 
అయితే ఆ ఖాళీల లెక్కలను పరిశీలిస్తే విద్య, హోం శాఖలలో ఎక్కువగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు అన్నీ కలిసి దాదాపు 200 వరకు సంస్థలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. అయితే ఈ సంస్థల్లో కూడా ఏళ్లుగా నియమకాలు జరగకపోవడంతో అనేక ఖాళీలు ఉన్నాయి. దీంతో ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.