శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (13:47 IST)

పాక్ భూభాగంపై భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్.. ఖురేషి సంచలన ఆరోపణలు

surgical strike
పాకిస్థాన్ భూభాగంపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందని.. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం ఖురేషి సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌‌లో నెలకొన్న సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్‌‌పై దాడి చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోందంటూ నిందారోపణలు చేశారు. అబుదాబీలో పర్యటిస్తున్న ఎస్ఎం ఖురేషీ మీడియాతో మాట్లాడారు. 
 
భారత ప్రభుత్వం మరోసారి పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని యోచిస్తోందని, దానికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని ఖురేషి అన్నారు. అయితే ఈసారి భారత్ అలాంటి దాడులకు పాల్పడితే తిప్పికొట్టడానికి పాక్ సిద్ధంగా ఉందన్నారు. 
 
భారత్ దాడులు చేస్తుంటే తామేమీ చేతులు కట్టుకుని కూర్చోబోమన్నారు. తమ దేశానికీ ఆయుధ సంపత్తి ఉందని, ఈ విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలని అన్నారు. కాగా, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.