శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (11:28 IST)

జో బైడెన్ టీమ్‌లో భారత సంతతి వ్యక్తికి చోటు.. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా..

Vedant Patel
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసాయి.. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలై.. జో బైడెన్ విజయం సాధించారు. జనవరి నెలలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, తన టీమ్‌ను పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు జో బైడెన్.. తన టీమ్‌లో భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
 
తాజాగా.. మరో భారత వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్ అండ్ ప్రెస్ స్టాఫ్‌కు అదనపు సభ్యులను నియమించిన బైడెన్.. భారతీయ-అమెరికన్ వేదంత్ పటేల్‌ను అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలను అప్పజెప్పారు. ప్రస్తుతం బైడెన్ సీనియర్ ప్రతినిధిగా ఉన్న పటేల్.. ఎన్నికల ప్రచార సమయంలో నెవెడా, వెస్ట్రన్ ప్రైమరీ-స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కీలకంగా పనిచేశారు.
 
అంతకుముందు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ వద్ద డెమోక్రటిక్ నేషనల్ కమిటీలో(వెస్ట్రన్ రీజినల్ ప్రెస్ సెక్రటరీ) కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా, బైడెన్ 16 మంది కొత్త వారిని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ అండ్ ప్రెస్ స్టాఫ్‌గా నియమించారు. మొత్తంగా అమెరికా అధ్యక్ష టీమ్‌లో భారతీయులు కీలక బాధ్యతలు అందుకుంటున్నారు.