1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tomorrow I will post about Demonetisation, Gold control and will conclude my thought on all these issues

నోట్లరద్దు, బంగారంపై మంగళవారం ట్వీట్ చేస్తా: వెయిట్ అండ్ సీ పవన్ కల్యాణ్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా రాజకీయాంశాలపై స్పందిస్తూ రాజకీయాల్లో వేడిపుట్టిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రత్యేక హోదాపై స్పందించిన పవన్ కల్యాణ్.. మరోసారి బ

Demonetisation
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా రాజకీయాంశాలపై స్పందిస్తూ రాజకీయాల్లో వేడిపుట్టిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రత్యేక హోదాపై స్పందించిన పవన్ కల్యాణ్.. మరోసారి బీజేపీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు. బీజేపీని వదిలేది లేదని ఆదివారం ట్వీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్, తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, బంగారం నియంత్రణపై మంగళవారం తన ఆలోచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయనున్నట్లు ప్రకటించారు.
 
ట్విట్టర్ ద్వారా ఆదివారం స్పందించిన పవన్ కల్యాణ్.. బీజేపీపై ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం పెట్టి ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనక్కి వెళ్లిందన్నారు. తాను ఐదు అంశాలపై ట్విట్టర్‌లో స్పందించనున్నానని చెప్పిన పవన్.. ఇందులో భాగంగా గోవధ, రోహిత్‌ వేముల ఆత్మహత్య, సినిమా థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శనపై ట్వీట్ చేశారు. ఆదివారం నాలుగో అంశంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించిన తీరుపై స్పందించారు.
  
జైఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలుకోల్పోయిన 400 మంది విద్యార్థులపై ప్రమాణం చేసి చెప్తున్నానని.. బీజేపీ ఏ హామీ ఇచ్చిందో దానిపై సమాధానం చెప్పేదాక విడిచిపెట్టే సమస్యే లేదని హోదాపై పవన్ ఫైర్ అయ్యారు. తాజాగా నోట్ల రద్దు, బంగారం నియంత్రణపై మంగళవారం ట్విట్టర్ ద్వారా స్పందిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. 
తర్వాతి కథనం
'అమ్మ' కోసం సినిమా... రమ్య కోసం మార్ఫింగ్... అమ్మ ప్రభావం అంతా...