'అమ్మ' కోసం సినిమా... రమ్య కోసం మార్ఫింగ్... అమ్మ ప్రభావం అంతా...
30 ఏళ్లపాటు పార్టీని ఒంటిచేత్తో నడిపిన ధీర వనిత. ప్రతిపక్షం డీఎంకేకు నీళ్లు తాగించిన రాజకీయ ఉద్ధండురాలు. 2016 సంవత్సరం ఆమెను తీసుకెళ్లిపోయింది. 2016 ముగింపు సందర్భంగా ప్రధానమైన విషయాలను చర్చించుకోవాల్సి వచ్చినప్పుడు జయలలిత గురించి చెప్పకుండా ఉండలేం మ
30 ఏళ్లపాటు పార్టీని ఒంటిచేత్తో నడిపిన ధీర వనిత. ప్రతిపక్షం డీఎంకేకు నీళ్లు తాగించిన రాజకీయ ఉద్ధండురాలు. 2016 సంవత్సరం ఆమెను తీసుకెళ్లిపోయింది. 2016 ముగింపు సందర్భంగా ప్రధానమైన విషయాలను చర్చించుకోవాల్సి వచ్చినప్పుడు జయలలిత గురించి చెప్పకుండా ఉండలేం మరి. ఆమె మరణం ఓ మిస్టరీగా మారిందనీ, సీబీఐ విచారణం జరిపించాలని ఇప్పటికే కొందరు వాదిస్తున్నారు.
ఇకపోతే అత్యంత శక్తివంతురాలయిన జయలలిత బయోపిక్ తీయాలని పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరైతే అమ్మలా రమ్యకృష్ణ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ జయలలిత బొమ్మ తల స్థానంలో రమ్యకృష్ణ ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసేస్తున్నారు. ఈ ఫోటో చూసిన రమ్యకృష్ణ చాలా ఎగ్జయిటయిపోయిందట. నిజంగా అమ్మ పాత్రలో నటించే అవకాశం వస్తే అంతకన్నా ఏముంది అంటోందట రమ్యకృష్ణ. మరి ఎవరైనా చిత్రాన్ని తీసేందుకు సాహసం చూపిస్తారా..... చూడాల్సిందే.