1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Two Major Operations to RK Roja

నగరి ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు!

RK Roja
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరి నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు, సినీ నటి ఆర్కే. రోజా ఉన్నట్టుండి ఆస్పత్రిపాలయ్యారు. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. ఈ ఆపరేషన్ల తర్వాత ఆమెను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు సోమవారం తరలించారు. 
 
ఈ క్రమంలో మరో రెండువారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా ఆరోగ్య విషయమై ఆమె భర్త సెల్వమణి ఆడియో టేప్‌ విడుదల చేశారు. 
 
ఈ మేరకు ఇది వరకే ఆమెకు ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ హడావిడి ముగియడంతో రోజా చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. 
 
వైఎస్సార్‌‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆడియో టేప్ రూపంలో ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే, రోజా ఏ సర్జరీలు చేయించుకున్నారన్నది తెలియాల్సి ఉంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భార్య మద్యం సేవించడం నచ్చలేదు.. విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే?