1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Schools and Colleges closed in Andhra Pradesh due to Coronavirus

ఏపీలో కరోనా వైరస్ సోకిన స్కూల్స్, కాలేజీలు మూసివేత

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా విద్యాశాఖ కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. ‌కరోనా కేసులు వచ్చిన పాఠశాలలను, విద్యాసంస్థలు మూసేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. 
 
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
 
ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టినట్టు తెలిపారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని ఆదేశించారు.
 
రాజమండ్రిలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని , కరోనా సోకిన వారిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామని అన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రోజంతా బ్యాటరీ బ్యాకప్‌‌తో వన్ ప్లస్ నార్డ్ ఎన్100 ఫోన్.. ఫీచర్స్ ఇవే