గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (13:56 IST)

మరాఠా యోధుడికి తీవ్ర అస్వస్థత

మరాఠా యోధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హూటాహిటన బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఒక్కసారిగా కడుపునొప్పి రావడంతో చికిత్స కోసం ముంబైలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. 
 
వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి.. పిత్తాశయంలో సమస్య ఉత్పన్నమైనట్లుగా గుర్తించారు. అయనకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. వైద్యుల సూచనల మేరకు శరద్ పవార్‌ ఈనెల 31వ తేదీన శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. 
 
ఈ విషయాన్ని ఎన్‌సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శరద్ పవార్‌ అరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఆయన ఉదరసంబంధమైన సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. తమ నేత ఆరోగ్యం మెరుగయ్యే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నవాబ్ మాలిక్ ప్రకటించారు.