1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Uncle son in-law scrambled, uncle died

మామ అల్లుళ్ళ పెనుగులాట‌, మామ మృతి

Uncle
కృష్ణాజిల్లా కోడూరులో ఈ సంఘ‌ట‌న జరిగింది. మామ అల్లుడు మధ్య ఏర్పడిన ఘర్షణలో ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాట వలన మామ మృతి చెందాడు. కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది అని కోడూరు ఎస్ఐ పి నాగరాజు తెలిపారు.

కోడూరు తూర్పు ప్రాంతానికి చెందిన నరహరశెట్టి సుబ్రమణ్యం సావిత్రి దంపతుల రెండవ కుమార్తె కృష్ణకుమారిని కోడూరుకు చెందిన ముత్తిరెడ్డి నాగ రత్తయ్య కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడుకి పుట్టుకతోనే పోలియో వచ్చి వికలాంగుడ‌య్యాడు.

అప్పటి నుండి అల్లుడు మామ‌తో గొడ‌వ‌ప‌డుతున్నాడు. తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వాడటం వలన... మీ అశ్రద్ధ వల్లే నా కుమారుడు వికలాంగుడిగా పుట్టాడు అంటూ... గత కొద్ది కాలం నుండి అత్తామామలను నిందిస్తూ వచ్చాడు. నిన్న అర్ధ‌రాత్రి అత్తమామలు, అల్లుడు నాగ రత్తయ్య కోడూరులో వారి బంధువుల ఇంటి వ‌చ్చారు. అక్క‌డ మాటా మాట పెరిగి మామ అల్లుళ్ళు కొట్టుకున్నారు. ఈ పెనుగులాట‌లో మామ మృతి చెందాడ‌ని పోలీసులు తెలిపారు.
About Writer
జెఎస్కె
తర్వాతి కథనం
China's new friend-తాలిబన్లకు స్నేహ హస్తం అందిస్తోన్న డ్రాగన్ కంట్రీ..