1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Varma vs Teja, NTR Bio Pic

ఎన్టీఆర్ జీవితంతో ఆడుకుంటున్నారా? వర్మ వర్సెస్ తేజ... ఏం చేయబోతున్నారు?

స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. కాకపోతే ఆ పేజీలో కొన్ని పేజీలు ప్రజలకు తెలియవు. ఇప్పుడు వాటిని బయటపెడ్తామంటూ అటు వర్మ ఇటు ఆయన శిష్యుడు తేజ ముందుకు దూకుతున్నారు. రాంగోపాల్ వర్మ అయితే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర్నుంచ

Varma vs Teja
స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. కాకపోతే ఆ పేజీలో కొన్ని పేజీలు ప్రజలకు తెలియవు. ఇప్పుడు వాటిని బయటపెడ్తామంటూ అటు వర్మ ఇటు ఆయన శిష్యుడు తేజ ముందుకు దూకుతున్నారు. రాంగోపాల్ వర్మ అయితే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర్నుంచి ఎన్టీఆర్ దివంగతుడయ్యే వరకూ తీస్తానని చెపుతున్నారు. ఇక ఆయన శిష్యుడు, దర్శకుడు తేజ ఏకంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను మొత్తాన్ని తెరకెక్కిస్తానంటున్నాడు. మరి ఈయన చూపించేది ఎలా వుంటుందన్నది ఆసక్తికరం. 
 
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వైసీపీ నాయకుడు ప్రొడ్యూస్ చేస్తుంటే దానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలయ్య ప్రొడ్యూస్ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకుడు. తెలుగు వెండితెరపై రారాజుగా వెలిగిన ఆ మహా నటుడి జీవితాన్ని ఎలా తెరకెక్కిస్తారో కానీ వివాదాలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. సినిమాలు స్టార్ట్ అయితే ఇక ఏ స్థాయిలో ఇవి చెలరేగుతాయో వేచి చూడాల్సిందే. మొత్తమ్మీద ఎన్టీఆర్ జీవితంతో ఆడుకుంటున్నారేమోనన్న వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
రూ.2713 కోట్లకు పెరిగిన ఎస్సీ కార్పోరేషన్ బడ్జెట్... జూపూడి, ఇన్నోవాలు ఇస్తున్నారు...