శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 11 అక్టోబరు 2017 (20:21 IST)

ఇంకోసారి పవన్ జోలికి వెళితే.. ఏం చేస్తానంటే... చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కొందరు నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ప్రశాంతంగా మాట్లాడాలి. రెచ్చిపోయి మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్‌ మనోడే.. అతన్ని ఎందుకు విమర్శిస్తున్నా

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కొందరు నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ప్రశాంతంగా మాట్లాడాలి. రెచ్చిపోయి మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్‌ మనోడే.. అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారు. మీ పని మీరు చూసుకోండి.. పార్టీ గురించి తప్పుగా మాట్లాడటం.. మనకు కావాల్సిన వారి గురించి చెడు ప్రచారం చేయడం మానుకోండి.. ఇదంతా స్వయంగా బాబు చెప్పిన మాటలే.
 
చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో టిడిపి నేతలు ఆశ్చర్యపోయారు. నిన్న విజయవాడలో టిడిపి నేతలతో సమావేశమైన బాబు అశోక్ గజపతిరాజు, పితాని సత్యానారాయణ ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్‌ ఎవరో తెలియదంటూ వ్యాఖ్యలు చేయడం, అలాగే విమర్శలు చేయడంపై బాబు మండిపడ్డారు. 
 
పవన్ కళ్యాణ్ పైన బాబు ఆ స్థాయిలో స్పందించడం టిడిపి నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2014 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావాలని కాలికి బలపం కట్టుకుని తిరిగిన పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క పదవి కూడా ఆశించకుండా వుండటం సామాన్యం కాదు. అందుకే బాబుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం మరి.