హిందూపురం నుంచి పోటీపై పురంధేశ్వరి.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఏమన్నారు?
వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బీజేపీ నేత పురంధేశ్వరి పోటీ చేయనున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో రాజకీయంగా తన భవిష్యత్ కార్యాచరణ గురించి పురంధేశ్వరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ప్రత్య
వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బీజేపీ నేత పురంధేశ్వరి పోటీ చేయనున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో రాజకీయంగా తన భవిష్యత్ కార్యాచరణ గురించి పురంధేశ్వరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ప్రత్యేకంగా హిందూపురం నుంచి పోటీ చేయాలని పార్టీ కేడర్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. అయితే పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
రాష్ట్రంలో అన్ని స్థానాలకు పార్టీ కేడర్ తనను ఆహ్వానిస్తోందని.. అలాంటప్పుడు ఇలాంటి పుకార్లు ఎలా పుడుతాయో తెలియట్లేదన్నారు. ఎన్టీఆర్ రాయలసీమకు దత్తపుత్రుడి లాంటి వారని ఆమె పేర్కొన్నారు.
అలాగే ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని, సినిమా తీస్తే ఆయన గౌరవాన్ని పెంచేలా ఉండాలి గానీ ఒక్క కోణంలో సినిమా తీయాలనుకోవడం సబబు కాదని పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమాపై ఆమె స్పందించారు.
ఆంధ్రులకు ఆత్మగౌరవం అంటే ఏంటో అర్థం చెప్పిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని గతంలో రామ్ గోపాల్ వర్మ అన్న మాటలను ఆమె గుర్తు చేశారు. అలాంటి మహానీయుడిని బజారుకీడ్చొద్దని ఆమె ఆర్జీవీని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.