మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (16:05 IST)

నాకంటే ముందెళ్తావా... బాలయ్య మళ్లీ ఏసేశాడు...

బాలకృష్ణకు బాగా ప్రేమ ఎక్కువయితే ఏం చేస్తాడో తెలుసా... దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన మాట గుర్తు లేదా... అదేనండీ. ప్రేమ బాగా ఎక్కువయితే చేతులకు పనిచెప్తారు. ఎడాపెడా చితక బాదుతారు. మరోసారి బాలయ్యకు హిందూపురంలో ప్రేమ పొంగింది. అంతే... తన చేతిని ఆయుధంగా

బాలకృష్ణకు బాగా ప్రేమ ఎక్కువయితే ఏం చేస్తాడో తెలుసా... దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన మాట గుర్తు లేదా... అదేనండీ. ప్రేమ బాగా ఎక్కువయితే చేతులకు పనిచెప్తారు. ఎడాపెడా చితక బాదుతారు. మరోసారి బాలయ్యకు హిందూపురంలో ప్రేమ పొంగింది. అంతే... తన చేతిని ఆయుధంగా చేసుకుని ఒక్కటిచ్చాడు. 
 
తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ, ఓ కార్యకర్తపై చేయిచేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఓ ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో బాలయ్య కంటే ముందుగా ఓ కార్యకర్త ఆ ఇంట్లోకి దూసుకువెళ్తుండగా... ఎందుకంత తొందర అంటూ చెంప చెళ్లుమనిపించారు. బాలయ్య దెబ్బకు కార్యకర్త దిమ్మతిరిగి పక్కకెళ్లిపోయాడు. ప్రేమ పొంగుకొస్తే బాలయ్య అలాగే చేస్తాడు మరి. గతంలో కూడా సెల్ఫీ దిగేందుకు వచ్చిన ఓ అభిమానిపైనా, షూటింగులో ఓ అసిస్టెంటుపైనా ఇలాగే ప్రేమ పొంగి వారికి రుచి చూపించారు. ఇప్పుడు మళ్లీ అదే జరిగింది.