1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (15:14 IST)

ఐ యామ్‌ ఏ ఫెయిల్యూర్ ఎంపీ.. : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

'ఐ యామ్‌ ఏ ఫెయిల్యూర్ ఎంపీ'.. ఈ విషయం నా మనస్సాక్షి చెపుతోందని అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. అందుకే వచ్చేవారంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.

'ఐ యామ్‌ ఏ ఫెయిల్యూర్ ఎంపీ'.. ఈ విషయం నా మనస్సాక్షి చెపుతోందని అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. అందుకే వచ్చేవారంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ... ఎంపీగా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం తాడిపత్రికి నీరు కూడా తీసుకురాలేకపోయినట్లు తెలిపారు. 
 
అనంతపురం అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డుతగిలాయని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి దయాదాక్షిణ్యాలపై బతకలేదని చెప్పారు. తాను ఈ పదవిలో కొనసాగలేనని.. వచ్చే బుధవారం రాజీనామా చేస్తానని చెప్పారు.
 
వాస్తవానికి గురువారమే ఢిల్లీ వళ్లి రాజీనామా చేయాలని భావించి స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేయగా, స్పీకర్ సుమిత్రా మహాజన్ అందుబాటులో లేరని చెప్పారనీ, సోమవారం తర్వాత ఆమె ఢిల్లీలో అందుబాటులో ఉంటారని స్పీకర్ కార్యాలయం చెప్పిందని తెలిపారు. అందుకే మంగళ, బుధవారాల్లో ఢిల్లీకి వెళ్లి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఎంపీగా తాను ఫెయిల్ అయ్యానని తన మనస్సాక్షి చెబుతోందని అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలోని చాగల్లు రిజర్వాయర్‌కు నీరు కూడా తీసుకురాలేని తనకు ఎంపీ పదవి ఎందుకన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకే రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు. 
 
అయితే, కేవలం ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని... టీడీపీకి కాదని జేసీ తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను భవిష్యత్తులో కూడా పని చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు. కేవలం ప్రజాభిమానంతోనే తాను ఎంపీనయ్యానని... ఎవరి దయాదాక్షిణ్యాలతోనో కాదని జేసీ స్పష్టం చేశారు.