కంచ ఐలయ్య ఓ దేశ ద్రోహితో సమానం : ఎంపీ టీజీ వెంకటేశ్
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన ఆచార్య కంచ ఐలయ్యపై అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మండిపడ్డారు. కంచ ఐలయ్యను ఓ దేశ ద్రోహీగా పోల్చారు.
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన ఆచార్య కంచ ఐలయ్యపై అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మండిపడ్డారు. కంచ ఐలయ్యను ఓ దేశ ద్రోహీగా పోల్చారు.
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన ఐలయ్య తీరుపై హైదరాబాద్‌లో ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ... సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రొ.కంచ ఐలయ్యలాంటి వారు దేశ ద్రోహులతో సమానమన్నారు.
ఇలాంటి పదాలతో రాసేవారిని అరబిక్ దేశాలలో నడి రోడ్డు మీదే శిక్షిస్తారని, మతాన్ని, కులాన్ని అవమానపరిచే ఐలయ్య లాంటి వాళ్లను నడిరోడ్డుపై ఉరి తీసేలా మన దేశంలోనూ చట్టాలు తీసుకురావాలన్నారు. ఐలయ్యకు మద్దతుగా నిలుస్తోన్న నేతలను మతిభ్రమించిన నేతలుగా టీజీ వెంకటేశ్ అభివర్ణించారు. ఐలయ్యపై అన్ని ప్రాంతాల్లోనూ కేసులు పెడతామని అన్నారు.
అలాగే, ఈ సమావేశంలో పాల్గొన్న సినీనటి కవిత మాట్లాడుతూ.. కంచ ఐలయ్య డేరా బాబాకంటే పెద్ద ద్రోహని అన్నారు. ఆర్యవైశ్యులను అవమానపర్చిన ఐలయ్యకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి ఐలయ్యపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యులు ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తారని, అటువంటి వారిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.