శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (16:19 IST)

అలా అయిన తరువాత ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న రోజా...

రాజకీయాల్లో ఓటమి.. గెలుపనేది సహజమే. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది నేతలు మాత్రం ఓటిమిని అస్సలు భరించలేరు. తాము రంగంలోకి దిగితే ఖచ్చితంగా గెలుపే ఉండాలన్నది వారి ఆలోచన. అలాంటి నేతల్లో వైసిపి ఎమ్మెల్యే రోజా ఒకరు. అధినేత జగన్ ఎక్కడికి పంపినా సెంటర్

రాజకీయాల్లో ఓటమి.. గెలుపనేది సహజమే. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది నేతలు మాత్రం ఓటిమిని అస్సలు భరించలేరు. తాము రంగంలోకి దిగితే ఖచ్చితంగా గెలుపే ఉండాలన్నది వారి ఆలోచన. అలాంటి నేతల్లో వైసిపి ఎమ్మెల్యే రోజా ఒకరు. అధినేత జగన్ ఎక్కడికి పంపినా సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలవడం రోజాకు అలవాటు. చెడామడా ప్రభుత్వాన్ని కడిగేయడం రోజాకు అలవాటు. అలాంటిదే నంద్యాల ఉప ఎన్నికల్లో, కాకినాడ ఎన్నికల్లో చేశారు. అది కాస్త పూర్తిగా బెడిసికొట్టింది. అధినేత జగన్, రోజాల వ్యాఖ్యలే ఆ పార్టీని కొంపముంచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన రోజా ఘోరంగా ఓడిపోవడంతో కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున బురదజల్లిన రోజా ఫలితాల తరువాత కాస్త తగ్గినట్లు స్పష్టంగా కనబడుతోంది. ఆమె నోరు తెరిస్తే పక్క వ్యక్తి నోరు మూయాల్సిందేనన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఇలాంటి పరిస్థితి నుంచి ఎన్నికల ఫలితాల తరువాత కాస్త ఉపశమనం పొందారు టిడిపి నేతలు. 
 
కొన్నిరోజుల పాటు సొంత నియోజకవర్గంలో కూడా పెద్దగా పర్యటించని రోజా రెండురోజుల క్రితం మాత్రమే పర్యటించారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న రోజా ఎక్కడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. కారణం లేవలేని దెబ్బ ఉప ఎన్నికల్లోను, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో రావడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి రోజా నోరు తెరిచే అవకాశం లేదు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారట టిడిపి నేతలు.