శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (07:19 IST)

"లవకుశ" చిత్రం గుర్తుకొస్తుంది: హరికృష్ణ

జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం "జై లవ కుశ" ఆడియో ఆదివారం రాత్రి విడుదలైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ నటుడు, హీరో తండ్రి హరికృష్ణ మాట్లాడుతూ... ‘అన్న ప్రొడ్యూసర్.. తమ్ముడు ఆ

జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం "జై లవ కుశ" ఆడియో ఆదివారం రాత్రి విడుదలైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ నటుడు, హీరో తండ్రి హరికృష్ణ మాట్లాడుతూ... ‘అన్న ప్రొడ్యూసర్.. తమ్ముడు ఆర్టిస్ట్’ గా రూపొందించిన చిత్రం ‘జై లవ కుశ’ అంటూ తన కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి నందమూరి హరికృష్ణ ఆనందంగా చెప్పారు.
 
ఈ చిత్రం పేరు వినగానే తన తండ్రి ఎన్టీఆర్ నాడు నటించిన ‘లవకుశ’ చిత్రం గుర్తుకు వస్తోందన్నారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో ‘జై లవ కుశ’ నిర్మాత కళ్యాణ్ రామ్, దర్శకుడు బాబీ, హీరోయిన్ రాశీఖన్నా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.