శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (10:22 IST)

సైబరాబాద్‌లో సైబర్ దాడులు? అదనంగా షీ షటిల్స్‌...

సైబరాబాద్‌లో సైబర్ దాడులు జరుగనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అదనంగా షీ షటిల్స్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ దాడులపై సైబరాబాద్‌ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ షానవాజ్‌ ఖాసిం మాట్లాడుతూ...

సైబరాబాద్‌లో సైబర్ దాడులు జరుగనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అదనంగా షీ షటిల్స్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ దాడులపై సైబరాబాద్‌ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ షానవాజ్‌ ఖాసిం మాట్లాడుతూ... 
 
ఇటీవల సైబర్‌ దాడులంటూ పుకార్లు సృష్టిస్తున్నారని, వాటిని విశ్వసించవద్దని, ఈ విషయంలో ప్రత్యేక నిఘావుంచి నిత్యం అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. మహిళలు రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకంగా షీ షటిల్‌ వాహనాలు, దేశంలోని వివిధ ప్రాంతాలవారు సురక్షితంగా నివసించేందుకు సేఫ్‌ స్టేవంటి కార్యక్రమాలను చేపట్టడంతోపాటు ట్రాఫిక్‌ నియంత్రణలో ట్రాఫిక్‌ వలంటీర్లను నియమించి సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. 
 
ఆ తర్వాత ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి భరణిఅరోల్‌ మాట్లాడుతూ, షీ షటిల్స్‌ సర్వీసులు మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని అర్జీలు వస్తున్నాయని, దాతలు ముందుకురాగానే అదనపు సర్వీసులు నడిపిస్తామన్నారు.