శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:43 IST)

బాబు హైదరాబాద్ వాసి.. పవన్ అజ్ఞాతవాసి.. వెల్లంపల్లి ఎద్దేవా

రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడం చేయకుండా ప్రభుత్వంపై విమర్శలు చేసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ వాసి అని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అజ్ఞాతవాసని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మ్మోహన్‌రెడ్డి అని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 
 
చంద్రబాబు పరాయి రాష్ట్రంలో ఉంటూ.. స్వలాభం కోసం చేసే నీచ విమర్శలు చేయడం మానుకోవాలని మంత్రి మండిపడ్డారు. పనికిమాలిన రాజకీయాలు చేసే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ, పేమెంట్‌లు తీసుకునే రామకృష్ణలు సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇక పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో పవర్‌ స్టార్‌ కావచ్చు ప్రజల్లో మాత్రం ఫెయిల్యూర్‌ స్టారే అని ఎద్దేవా చేశారు.