గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:40 IST)

కర్నూలులో ఓ లేడీ డాక్టర్‌కి కోవిడ్ -19... సరుకులు కొనేటప్పుడు..?

కర్నూలు ఓ వైద్యుడి కుటుంబానికి కరోనా సోకింది. కర్నూలులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గ్యాప్ లేకుండా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య కర్నూలులో 13 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఆరుగురు ఈ మధ్య చనిపోయిన డాక్టర్ కుటుంబ సభ్యులవే ఉన్నాయి. 
 
కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఓ లేడీ డాక్టర్‌కి కూడా కొవిడ్-19 సోకినట్టు అధికారులు తేల్చారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 38 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 572కి పెరిగింది. మొత్తం కేసుల్లో 44 శాతం గుంటూరు, కర్నూలు జిల్లాలోవే. ఇప్పటివరకు 35 మంది మాత్రం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
చాలామంది కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో నిర్ణయించిన సమయానికి సరుకులు కొంటున్నారు. చాలామంది తాము బయట కొని తెచ్చుకున్న సరుకుల్ని అదే రోజు ముట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. వాటిని కచ్చితంగా... 5 రోజులు పక్కన పెట్టి... ఆరో రోజు మాత్రమే ముట్టుకోవాలి. ఈలోగా... వాటిపై ఉన్న వైరస్ చనిపోతుంది. అలా కాకుండా... ఐదు రోజుల లోపే ముట్టుకుంటే... వైరస్ చేతులకు అంటుకొని... మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది.