ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:22 IST)

తెలంగాణాలో కొత్తగా 66 కరోనా కేసులు.. గ్రీన్ జోన్‌లో మరో కేసు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. దీంతో ఈ కేసులు వెయ్యికి చేరువయ్యేలా కనిపిస్తోంది. శనివారం కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 46 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. 
 
కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 427 కరోనా పాజిటివ్ కేసులు, హైదరాబాద్‌లో 286 యాక్టివ్ కేసులు, నమోదు కాగా, 131 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్‌ కాగా, 18 మంది మృతి చెందారు. 
 
మరోవైపు, ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌లో మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఒక కేసు నమోదైంది. ఇపుడు మరో కేసు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ జిల్లాలో మొత్తం 2 కేసులు నమోదయ్యాయి. 
 
జిల్లాలోని ఈదులగూడకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన సూర్యాపేటకు చెందిన వ్యక్తి ద్వారా సోకిందని అధికారులు చెబుతున్నారు. పూల వ్యాపారం చేస్తున్న మహిళ.. కాంటాక్ట్‌ అయినవారిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.