50 సర్జరీలు చేసుకున్న టిక్ టాక్ స్టార్ సహార్‌కు కరోనా
దైవదూషణ, హింసను ప్రేరేపించడం, యువకులను అవినీతికి ప్రోత్సహించడం, తగని మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందడం వంటి ఆరోపణలపై గతేడాది అక్టోబరులో అరెస్టైంది.. 22 ఏళ్ల ఇరానియన్ టిక్‌టాక్ స్టార్ సహార్ తబార్. హాలీవుడ్ నటి ఏంజెలినీ జోలీలా తన రూపురేఖలను మార్చుకునేందుకు ఆపరేషన్లు చేయించుకున్న 22 ఏళ్ల ఇరానియన్ తబార్ కరోనా బారిన పడింది.
ప్రస్తుతం టెహ్రాన్‌లోని సినా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంది. జైలులో ఉన్న ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్నప్పటికీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించినట్టు ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘం పేర్కొంది. సోషల్ మీడియా స్టార్ సహార్ తబార్ అసలు పేరు ఫతేమే ఖిష్వండ్.
వింతగా ఉండే ఆమె ముఖాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన తర్వాత ఒక్కసారిగా ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ అవార్డు విజేత ఏంజెలినా జోలీలా కనిపించేందుకు సహార్ ఏకంగా 50 సర్జరీలు చేయించుకుంది.