శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:42 IST)

నెలసరి సమస్యలకు చెక్ పెట్టే ఆవాలు..

Mustard Oil
మహిళల్లో నెలసరి సమస్యలకు ఆవాలు చెక్ పెడతాయి. ఆవాల్లో ఐరన్‌, జింక్‌, మాంగనీస్‌, కాల్షియం ఉంటాయి. స్త్రీలలో నెలసరి సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. ఆవనూనెను నెలసరి సమయాల్లో ఉపయోగించే వారికి నెలసరి నొప్పులు మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఆవనూనె కొవ్వును కరిగిస్తుంది. పంటినొప్పితో బాధపడేవారికి ఆవాలు దివ్య ఔషధం. గోరు వెచ్చని నీటిలో చెంచాడు ఆవాలు వేసి.. ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. చర్మంపై ఏర్పడే పులిపిర్లను తొలగించడానికి కూడా ఆవ పొడి బాగా పనిచేస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి.

ఆవాల ముద్దను, కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.