శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (15:59 IST)

కరోనాను నియంత్రించే మునక్కాయ సూప్‌..

Drumstic soup
మునక్కాయ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మునక్కాయలోని విటమిన్లు, ఐరన్, కాల్షియంలు ఎముకలు పటిష్టంగా ఉంచేందుకు దోహదపడతాయి. వైరస్ కారకాలను ఇది దూరం చేస్తుంది. ఇంకా ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు. అలాంటి మునక్కాయతో సూప్ తయారు చేసి.. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన వారు తీసుకుంటే అనారోగ్య సమస్యలుండవని..కరోనా సోకదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
 
కరోనాకు చెక్ పెట్టే మునక్కాయ సూప్ ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు 
మునక్కాయ ముక్కలు - ఒక కప్పు 
టమోటా తరుగు - అర కప్పు 
వెల్లుల్లి, అల్లం పేస్ట్- ఒక స్పూన్ 
ఉల్లి పాయ తరుగు - అర కప్పు 
మిరియాల పొడి - అర స్పూన్ 
పసుపు పొడి - అర స్పూన్
ఉప్పు, నూనె - తగినంత
 
తయారీ విధానం :
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి మునక్కాయ ముక్కలు, టమోటా, ఉల్లి తరుగును దోరగా వేపుకుని.. ఉడికించుకోవాలి. తర్వాత వీటిని మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత మరో పెనం స్టౌ మీద బెట్టి ఒక స్పూన్ నూనె వేసి అందులో జీలకర్ర వేసి వేపుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్టును చేర్చాలి. ఆపై పసుపు పొడి చేర్చి.. రుబ్బుకున్న మునక్కాయ పేస్టును కలపాలి. తగినంత నీరు చేర్చాలి. ఐదు నిమిషాలు మరిగాక ఉప్పు, మిరియాల పొడి చేర్చి.. సూప్ సర్వింగ్ బౌల్‌లో తీసుకుని రస్క్‌తో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.. ఇంకా కరోనాకు చెక్ పెట్టవచ్చు.