శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (14:02 IST)

కరోనా వైరస్.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య

బీహార్‌లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య ఆదివారానికి ఆరుకు చేరింది. వివరాల్లోకి వెళితే, బీహార్‌లోని ముంగర్‌కి చెందిన వ్యక్తి కరోనావైరస్ సోకిన అనంతరం చికిత్స కోసం పాట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు.
 
ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరుకోగా.. బీహార్‌లో ఇదే తొలి కరోనా వైరస్‌ పాజిటివ్ వ్యక్తి మృతి కేసుగా నమోదైంది. 
 
రెండు రోజుల క్రితమే అతడు కోల్‌కతా నుంచి తిరిగొచ్చాడని పాట్నాలోని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇకపోతే, శనివారమే ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో బాధపడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
ముంబైలో కరోనావైరస్ పాజిటివ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందడంతో భారత్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకోగా.. పాట్నాలో మృతి చెందిన 38 ఏళ్ల యువకుడితో కలిపి ఆరుకు చేరింది.