గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (12:03 IST)

వకీల్ సాబ్ ఎప్పుడు వస్తున్నాడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా వకీల్ సాబ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ముఖానికి రంగు వేసుకొని పింక్ రీమేక్‌లో షూటింగ్‌కి పాల్గొన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. 
 
అయితే ఏప్రిల్ 14న లాక్ డౌన్‌ని ఎత్తివేసిన తర్వాత త్వరగా షూటింగ్ ముగించి అనుకున్న సమయానికి వకీల్ సాబ్‌నీ విడుదల చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇక దసరా పండుగకు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని ఇక దసరా పండుగ బరిలో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.