శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (16:13 IST)

అందరూ రవిశంకర్ ధ్యానంలో పాల్గొనాలి.. పవన్ కల్యాణ్ పిలుపు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రతిరోజూ ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ ధ్యానంలో అందరూ పాల్గొనాలని పవన్ పిలుపు నిచ్చారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమైన నేపథ్యంలో.. అందరూ రవిశంకర్ ధ్యానంలో పాల్గొనాలని చెప్పారు. ఇంకా టీవీలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. 
 
అందుచేత గొప్ప మానవతావాది అయిన ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి చొరవకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని యూట్యూబ్ లింక్‌ను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 
 
ఈ కల్లోల సమయాన్ని ప్రతిఒక్కరు దృఢ సంకల్పంతో అధిగమించగలరని కోరుకుంటూ.. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గారితో కలిసి లక్షలాదిగా ధ్యానంలో పాల్గొనాలని పవన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన అంజలి నటిస్తుందని టాక్ వస్తోంది. ఇంకా ఇందులో నివేదా థామస్ నటిస్తోంది.