సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (22:25 IST)

పవన్ - రవితేజ చేయాలనుకుంటున్న మల్టీస్టారర్‌ను ఫస్ట్ ఎవరు చేయాలనుకున్నారో తెలుసా?

పవర్ స్టార్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తారనుకుంటే.. వరుసగా సినిమాలు చేసేందుకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విక్రమ్ వేదా రీమేక్ చేసేందుకు పవన్ కళ్యాణ్‌ ఓకే చెప్పారని తెలిసింది. విజయ్ సేతుపతి - మాధవన్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.
 
ఆ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నిర్మాత రామ్ తాళ్లూరి దక్కించుకున్నారు. ఈ సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. విజయ్ సేతుపతి చేసిన గ్యాంగ్ స్టార్ పాత్రను పవన్ కళ్యాణ్ చేయనున్నారని... మాధవన్ చేసిన పోలీస్  పాత్రను రవితేజ చేయనున్నారని తెలిసింది. రామ్ తాళ్లూరికి .. పవన్‌కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో పవన్ ఈ సినిమాకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ భారీ మల్టీస్టారర్‌ను డైరెక్ట్ చేసేది ఎవరంటే.. వెంకీమామ సినిమాతో రీసెంట్‌గా సక్సెస్ సాధించిన డైరెక్టర్ బాబీ పేరు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో ఎనౌన్స్ చేస్తారని సమాచారం.
 
ఈ మల్టీస్టారర్‌ను ముందుగా ఎవరు చేయాలనుకుంటున్నారంటే... టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించనున్నారని వార్తలు వచ్చాయి. మాధవన్ - విజయ్ సేతుపతి ఈ రెండు పాత్రల్లో ఓ పాత్రలో నాగార్జున నటిస్తే.. మరో పాత్రను ఎవరు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఓ సందర్భంలో నాగార్జున ఈ రీమేక్ గురించి స్పందిస్తూ...  విక్రమ్ వేదా మూవీ చూసాను బాగుంది. ప్రస్తుతానికి రీమేక్‌కు సంబంధించి డిష్కషన్స్ జరుగుతున్నాయి ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని గతంలో చెప్పారు.
 
అయితే... ఏమైందో ఏమో కానీ... నాగార్జునతో చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దీంతో విక్టరీ వెంకటేష్‌తో విక్రమ్ వేదా రీమేక్ చేయాలనుకున్నారు. వెంకీ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారని.. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్నారు. ఈ ప్రచారం జోరందుకోవడంతో, సురేష్‌ ప్రొడక్షన్స్ వారు స్పందించారు. విక్రమ్ వేదా రీమేక్‌లో వెంకటేష్‌ నటించనున్నాడంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు.  
 
ఆ తర్వాత నాగార్జున - వెంకటేష్ కాంబినేషన్లో విక్రమ్ వేదా రీమేక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్లో టాక్ వచ్చింది. దీంతో నాగ్ అభిమానులు - వెంకీ అభిమానులు ఈ సినిమా వస్తే బాగుంటుందని ఆనందతో ఈ మూవీ కోసం ఎదురు చూసారు కానీ.. ఈ క్రేజీ మల్టీస్టారర్ కూడా వార్తలకే పరిమితం అయ్యింది కానీ.. సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు విక్రమ్ వేదా రీమేక్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఈ మూవీ చేయన్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.