శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (13:08 IST)

సితార, గౌతమ్‌తో సూపర్ స్టార్... సందేశం ఏమిటో తెలుసా?

లాక్ డౌన్ నేపథ్యంలో కరోనాకు సెలెబ్రిటీలు జాగ్రత్తలు చెప్తున్నారు. తాజాగా, టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు భార్య, సినీ నటి నమ్రత రెండు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి కరోనాపై జాగ్రత్తలు చెప్పింది. ఈ రెండు ఫొటోల్లో మొదటి దాంట్లో మహేశ్‌ బాబు తన కుమారుడు గౌతమ్‌తో కనపడుతున్నాడు. 
 
గతంలో ఓ షూటింగ్‌ సందర్భంగా తీసిన ఫొటోగా ఇది కనపడుతోంది. ఇందులో ముఖానికి కర్చిఫ్ కట్టుకున్న మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్‌కు కూడా మాస్కులు పెడుతున్నట్లు ఉంది. రెండో ఫొటోలో మహేశ్ బాబు తన కూతురు సితారతో ఉన్నాడు. 
 
ఇందులోనూ మహేశ్ కర్చిఫ్‌తో కనపడ్డాడు. ఆయన పక్కనే ఉన్న సితార ముఖానికి మాస్కులు ధరించి కనపడుతోంది. ఈ రెండు ఫొటోలను పోస్ట్ చేసిన నమ్రత... మాస్కు ధరించడానికి సూపర్‌స్టారే కావాల్సిన అవసరం లేదని, మాస్కులు ధరించి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనకు ఇష్టమైన వారిని కూడా కాపాడుకోవాలని సందేశమిచ్చింది.